ఈరోజు డీ పాల్ పాఠశాలలో “తెలుగు భాషా దినోత్సవాన్ని” జరుపుకున్నాము. గిడుగు రామ్మూర్తి పంతులుగారు తెలుగు భాష కోసం చేసిన కృషిని మరువలేము ఆయన పాఠశాలల్లో గ్రాంధిక భాషలో కాకుండా, వ్యవహారిక భాషలో పాఠ్యాంశాలు బోధించాలని ఎంతో కృషి చేశారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినాన్ని “తెలుగు భాషా దినోత్సవం” గా మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా డీ పాల్ పాఠశాలలో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలిపే పాటను, నృత్యాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” కథను బుర్రకథగా విద్యార్థులు చెప్పడం జరిగింది. ఫాదర్ సాజి గారు తెలుగు భాష గురించి తన అమూల్యమైన సందేశాన్ని తెలియజేశారు.